అదే హోటల్‌లో నాడు రీగన్‌పై దాడి
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:23 AM
45 ఏళ్ల క్రితం ఇదే హిల్టన్ హోటల్‌లో నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్‌పై కూడా హత్యాయత్నం జరగింది. అంతేనా, హిల్టన్ హోటల్‌ల నుంచి బయటకు..
45 ఏళ్ల క్రితం ఇదే హిల్టన్ హోటల్‌లో నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్‌పై కూడా హత్యాయత్నం జరగింది. అంతేనా, హిల్టన్ హోటల్‌ల నుంచి బయటకు వెళ్లే ఓ ద్వారం వద్దే నాడు రీగన్, ప్రస్తుతం ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. 1981 మార్చి 30వ తేదీన నాటి అమెరికా అధ్యక్షుడు రీగన్.. హిల్టన్ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో జాన్ హింక్లే జూనియర్ అనే వ్యక్తి జనంలోని రీగన్‌పై సెకన్ల వ్యవధిలో ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇందులో ఓ తూటా రీగన్ ఛాతీలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన రీగన్‌ను భద్రతా సిబ్బంది హుటాహుటిన జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించడంతో రీగన్ ప్రాణాలతో బయటపడ్డారు. హింక్లే చేసిన దాడిలో రీగన్‌తోపాటు నాటి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కూడా గాయపడ్డారు.