అన్న..చెల్లె.. ఇంకో చెల్లె..ప్రసవం చేసిన వైద్యురాలు ఈ నలుగురి బర్త్ డే ఒకటే
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:41 AM
తమిళనాట ఒకే కుటుంబంలోని ముగ్గురు పిల్లలు ఒకే తేదీన జన్మించి రికార్డులకెక్కారు. వారికి ప్రసవం చేసిన వైద్యురాలు కూడా అదే తేదీన జన్మించడం మరో విశేషం..
తిరునల్వేలి జిల్లాలో అరుదైన ఘటన
చెన్నై, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): తమిళనాట ఒకే కుటుంబంలోని ముగ్గురు పిల్లలు ఒకే తేదీన జన్మించి రికార్డులకెక్కారు. వారికి ప్రసవం చేసిన వైద్యురాలు కూడా అదే తేదీన జన్మించడం మరో విశేషం. తిరునల్వేలి జిల్లా పాళయంకోటలో ఈ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. క్రైస్తవమత బోధకుడైన జెఫర్‌సన్-షీబా మనోజ్ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కుమారుడు 2015లో, ఇద్దరు కుమార్తెలు 2017, 2025లో జన్మించారు. ఆ ముగ్గురూ జూన్ 10వ తేదీనే జన్మించారు. ఆ ముగ్గురూ పాళయంకోట పెరుమాళ్‌పురంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో జన్మించగా, వారికి ప్రసవం చేసిన డాక్టర్ రామోలాజనత్ డయానా కూడా జూన్ 10వ తేదీనే జన్మించడం మరో విశేషం. ఈ ఘటన ‘యూనివర్సల్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘ఫ్యూచర్ కలామ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది.