Share News

రణ్‌వీర్‌సింగ్‌ బహిరంగ క్షమాపణ

ABN , Publish Date - Apr 26 , 2026 | 03:55 AM

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌పై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. మైసూరు చాముండేశ్వరి భక్తులకు ఆయన బహిరంగ...

రణ్‌వీర్‌సింగ్‌ బహిరంగ క్షమాపణ

  • చాముండేశ్వరి దేవిని దర్శించుకుంటానన్న నటుడు

  • కేసును కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు

బెంగళూరు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌పై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. మైసూరు చాముండేశ్వరి భక్తులకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నెలరోజుల్లోగా మైసూరు చాముండేశ్వరిదేవిని దర్శించుకుంటానని హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. గత ఏడాది నవంబరు 28న గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న రణ్‌వీర్‌ కాంతార చాప్టర్‌-1 సినిమా గురించి ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అలాగే మైసూరు చాముండేశ్వరి దేవిని ప్రస్తావిస్తూ అపహాస్యంగా మాట్లాడారు. రణ్‌వీర్‌ వ్యాఖ్యలపై బెంగళూరులో అడిషినల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో న్యాయవాది ప్రశాంత్‌ మెథన్‌ ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై హైగ్రౌండ్స్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. న్యాయవాది వేసిన ప్రైవేటు పిటిషన్‌తోపాటు, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రణ్‌వీర్‌ హైకోర్టును ఆశ్రయించారు. తాను ముంబైలోని సింధి కుటుంబానికి చెందినవాడినని, ఘటన జరిగిన రోజు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలుసుకోలేకపోయానని పేర్కొన్నారు. ఇది సున్నితమైన అంశమని తనకు తెలియదని, తన వ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని, బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. త్వరలోనే చాముండేశ్వరి దేవిని దర్శించుకుని, పూజలు చేసి భక్తిని చాటుకుంటానని హైకోర్టుకు తెలియజేశారు.

Updated Date - Apr 26 , 2026 | 03:56 AM