Share News

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆస్తుల్లో ఐటీ సోదాలు

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:27 AM

ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఆమె కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల్లో సోమవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆస్తుల్లో ఐటీ సోదాలు
it

ముంబయి, సెప్టెంబరు 28: ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఆమె కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల్లో సోమవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఆమె మామ, సినీ నిర్మాత వషు భగ్నాని ఆస్తులు, పనోరమా స్టుడియోల్లోనూ సోదాలు జరిగాయి. అధికారులు బృందాలుగా ఏర్పడి ముంబయి నగరంలోని మొత్తం 12 చోట్ల సోదాలు చేశారు. విదేశాల్లో సినిమాల చిత్రీకరణకు ఫైనాన్స్‌ చేశామన్న పేరుతో నిధులను అక్రమంగా తరలించారన్న ఆరోపణల మేరకు ఈ సోదాలు జరిగాయి. పలు పత్రాలు, రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. విదేశాల్లో జరిగిన చిత్రీకరణకు సంబంధించిన ఖర్చులపై ఆరా తీస్తున్నారు. వషు భగ్నాని పూజా ఫిల్మ్స్‌ అనే సంస్థ పేరుతో కూలీ నెంబర్‌-1వంటి సినిమాలు తీశారు. ప్రస్తుతం ఆ సంస్థ వ్యవహారాలను ఆయన కుమారుడు, రకుల్‌ భర్త జాకీ భగ్నానీ చూసుకుంటున్నారు. రకుల్‌ ప్రస్తుతం రామాయణ్‌ సినిమాలో శూర్పనఖగా నటించారు.

ఈ వార్తలు కూడా చదవండి

రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు

ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది.

Updated Date - Sep 29 , 2026 | 05:29 AM