రాజ్యసభ వైస్ చైర్‌పర్సన్ల ప్యానెల్ పునర్నియామకం
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:34 AM
రాజ్యసభ వైస్ చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌ను తిరిగి నియమించింది. బీజేపీ, కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, బీజేడీ నుంచి మొత్తం ఆరుగురిని నామినేట్ చేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: రాజ్యసభ వైస్ చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌ను తిరిగి నియమించింది. బీజేపీ, కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, బీజేడీ నుంచి మొత్తం ఆరుగురిని నామినేట్ చేశారు. ఈ ప్యానెల్‌లో బీజేపీ నుంచి దినేశ్ శర్మ, కొన్యాక్, ఘన్‌శ్యామ్ తివారిలను, కాంగ్రెస్ నుంచి పులో దేవి నీతమ్‌ను, ఏఐఏడీఎంకే నుంచి తంబిదురైని, బీజేడీ నుంచి సస్మిత్ పాత్రను నామినేట్ చేశారు. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేని సమయంలో ఈ వైస్ చైర్‌పర్సన్‌లు సభను నడిపిస్తారు. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఏడేళ్లుగా లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించకపోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలే నామినేట్ చేసిన హరివంశ్ రాజ్యసభకు మూడోసారి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.