Share News

12 రాజ్యసభ స్థానాలకు అక్టోబరు 16న ఎన్నికలు

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:25 AM

ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ల్లోని 12 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 16న ఎన్నికలు జరగనున్నట్టు మంగళవారం ఈసీ ప్రకటించింది.

12 రాజ్యసభ స్థానాలకు  అక్టోబరు 16న ఎన్నికలు
parlament

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ల్లోని 12 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 16న ఎన్నికలు జరగనున్నట్టు మంగళవారం ఈసీ ప్రకటించింది. ఈ నెల 29న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుందని, అక్టోబరు ఆరో తేదీ వరకు నామినేషన్ల సమర్పణకు అవకాశం ఉందని తెలిపింది. నవంబరు 25న సభ్యుల పదవీ కాలం పూర్తికానున్న నేపథ్యంలో యూపీలో 10 స్థానాలు, ఉత్తరాఖండ్‌, బెంగాల్‌లలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ 12 సీట్లలో ప్రస్తుతం బీజేపీకి పది, బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలకు చెరొకటి ఉన్నాయి.

Updated Date - Sep 23 , 2026 | 05:25 AM