Share News

రాజ్యసభ ఎన్నికల భేరి!

ABN , Publish Date - May 23 , 2026 | 04:16 AM

దేశవ్యాప్తంగా 26 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల కమిషన్‌ శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ సహా 10 రాష్ర్టాల్లో జూన్‌-జూలై నెలల్లో పదవీ విరమణ చేయనున్న 24మంది...

రాజ్యసభ ఎన్నికల భేరి!

  • ఏపీ సహా 10 రాష్ట్రాల్లో 26 స్థానాలకు 18న పోలింగ్‌.. షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 26 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల కమిషన్‌ శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ సహా 10 రాష్ర్టాల్లో జూన్‌-జూలై నెలల్లో పదవీ విరమణ చేయనున్న 24మంది సభ్యుల స్థానాలకు రెగ్యులర్‌ ఎన్నికలు జరుపనుంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో రాజీనామాలతో ఖాళీ అయిన మరో రెండు స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. 26 స్థానాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ జూన్‌ 1వ తేదీన వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్‌(4), గుజరాత్‌(4), కర్ణాటక(4), మధ్యప్రదేశ్‌(3), రాజస్థాన్‌(3), జార్ఖండ్‌(2), ఈశాన్య రాష్ర్టాలైన మణిపూర్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాం, మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు జూన్‌ 8 చివరి తేదీ. జూన్‌ 18న పోలింగ్‌ నిర్వహిస్తారు. అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, మాజీ ప్రధాని దేవెగౌడ, ఖర్గే, దిగ్విజయ్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు జార్జ్‌ కురియన్‌, రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూల పదవీ కాలం జూన్‌లో ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated Date - May 23 , 2026 | 04:16 AM