Share News

నకిలీ ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లతో రాజస్థాన్‌లో ఐదుగురు బాలింతల మృతి

ABN , Publish Date - May 27 , 2026 | 04:04 AM

నకిలీ ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్ల కారణంగా ఐదుగురు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని కోటా ప్రభుత్వాస్పత్రిలో...

నకిలీ ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లతో రాజస్థాన్‌లో ఐదుగురు బాలింతల మృతి

కోటా, మే 26: నకిలీ ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్ల కారణంగా ఐదుగురు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని కోటా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలో సిజేరియన్‌ జరిగిన ఐదుగురు మహిళలకు రక్తస్రావాన్ని అరికట్టడానికి వైద్యులు ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే, రక్తస్రావం ఆగకపోగా.. రక్తపోటు, ప్లేట్‌లెట్లు పడిపోయి, కిడ్నీలు ఫెయిల్‌ అవ్వడంతో ఆ ఐదుగురు మహిళలు మరణించారు. మరణాలపై అనుమానం వచ్చిన రాజస్థాన్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు.. ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్ల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపగా అవి నకిలీవని తేలింది.

Updated Date - May 27 , 2026 | 04:04 AM