అమెరికా-పాక్ మధ్య యుద్ధం జరిగితే భారతదేశ మద్దతు పాకిస్థాన్‌కే
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:15 AM
అమెరికా, పాకిస్థాన్ మధ్య యుద్ధం గనక జరిగితే భారతదేశం పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే పాకిస్థాన్ మన పొరుగు దేశం’’ అంటూ రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ బీజేపీ చీఫ్ మదన్ సంచలన వ్యాఖ్యలు
జైపూర్, అక్టోబరు 16: ‘‘అమెరికా, పాకిస్థాన్ మధ్య యుద్ధం గనక జరిగితే భారతదేశం పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే పాకిస్థాన్ మన పొరుగు దేశం’’ అంటూ రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మాట అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మదన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడ్డాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో మదన్ రాథోడ్ స్పందించారు. తన మాటలను వక్రీకరించారని చెప్పారు. అమెరికా-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ గురించి మాత్రమే మాట్లాడానని తెలిపారు.