రాజా రవివర్మ చిత్రానికి వేలంలో 167 కోట్లు
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:59 AM
ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రం అరుదైన రికార్డును సృష్టించింది. యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఆయన గీసిన ఆయిల్ పెయింటింగ్ రూ.167.20 కోట్లకు అమ్ముడయింది.
యశోదా కృష్ణుల ఆయిల్ పెయిటింగ్‌కు రికార్డు ధర
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రం అరుదైన రికార్డును సృష్టించింది. యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఆయన గీసిన ఆయిల్ పెయింటింగ్ రూ.167.20 కోట్లకు అమ్ముడయింది. బుధవారం ముంబైలో ‘సాఫ్రోనార్ట్’ సంస్థ ఈ ఆన్‌లైన్ వేలంను నిర్వహించింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ డాక్టర్ సైరస్ ఎస్ పూనావాలా ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నారు. గత ఏడాది మరో ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన ‘గ్రామ యాత్ర’ వేలంలో రూ.118 కోట్ల ధర పలికింది. ఆ రికార్డును తాజాగా రాజా రవివర్మ చిత్రం అధిగమించింది. వేలం అనంతరం సైరస్ ఓ ప్రకటనలో స్పందిస్తూ.. ‘రాజా రవివర్మ అద్భుత చిత్రాన్ని దక్కించుకుని, భద్రపరిచే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది. ఇది జాతి సంపద. దీనిని ప్రజలు వీక్షించడానికి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని అన్నారు.