Share News

రైల్వేలో రిజర్వేషన్‌ టికెట్‌ను వేరొకరికి మార్చొచ్చు!

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:00 AM

ఏదైనా పనిమీద ఒకట్రెండు రోజుల్లో ప్రయా ణం ఉందనగా.. రైల్వే టికెట్‌ కన్ఫమ్‌ అవడం అంటే చాలా కష్టం! రిజర్వేషన్‌ దొరికితే..

రైల్వేలో రిజర్వేషన్‌ టికెట్‌ను వేరొకరికి మార్చొచ్చు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఏదైనా పనిమీద ఒకట్రెండు రోజుల్లో ప్రయా ణం ఉందనగా.. రైల్వే టికెట్‌ కన్ఫమ్‌ అవడం అంటే చాలా కష్టం! రిజర్వేషన్‌ దొరికితే.. అబ్బా చాలా అదృష్టమని భావిస్తారు!! అయితే ఇదే సమయంలో అతడు/ఆమె ప్రయాణానికి వెళ్లలేని పరిస్థితుల్లో.. ఆ రిజర్వేషన్‌ టికెట్‌ను వేరొకరిని బదిలీ చేయవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రత్యేక షరతుల కింద టికెట్‌ను వేరే వారి పేరుపై బదిలీ చేయవచ్చని, ఆ కన్ఫమ్‌ టికెట్‌పై అదే రైలుకు, అదే సమయానికి వేరొకరు ప్రయాణం చేయవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధిత అధీకృత రైల్వే అధికారుల ముందస్తు ఆమోదం తప్పనిసరి. ఈ సదుపాయం ఎంపిక చేసిన పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా ఆ వ్యక్తి కుటుంబంలోని వారికి, అర్హులైన గ్రూపు క్యాటగిరీల సభ్యులకు మాత్రమే బదిలీ చేసేందుకు అవకాశం ఉంటుంది. క్యాటగిరీని బట్టి రిజర్వేషన్‌ టికెట్‌పై పేరు మార్పునకు రైలు బయలుదేరే 24 లేదా 48 గంటల ముందు గా రైల్వే అధికారులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Updated Date - Feb 27 , 2026 | 04:00 AM