కదులుతున్న రైలు నుంచి చెత్తను విసిరేసిన రైల్వే ఉద్యోగి తొలగింపు
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:23 AM
కదులుతున్న రైలు నుంచి చెత్తను కిందికి విసిరేసిన ఓ రైల్వే కాంట్రాక్టు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. కలకత్తా-అజ్మేర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం ఓ....
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కదులుతున్న రైలు నుంచి చెత్తను కిందికి విసిరేసిన ఓ రైల్వే కాంట్రాక్టు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. కలకత్తా-అజ్మేర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం ఓ రైల్వే ఉద్యోగి చెత్తను మూట కట్టి పక్కన ఉన్న పట్టాల మీదకు విసిరేశాడు. దీన్ని అదే రైలులో ప్రయాణిస్తున్న దివ్య అనే ప్రయాణికురాలు వీడియో తీశారు. తర్వాత ఎక్స్‌లో పోస్టు చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే శాఖను ట్యాగ్ చేశారు. ఇది వైరల్ అయింది.