ప్రధాని పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కనిపించడం కన్నా సిగ్గుచేటు ఏముంది?
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:16 AM
ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ సహచరుడి పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కనిపించడం కన్నా, భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ద్వారా భారత హక్కులను తాకట్టు పెట్టడంకన్నా...
కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలను తిప్పికొట్టిన రాహుల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 : ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ సహచరుడి పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కనిపించడం కన్నా, భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ద్వారా భారత హక్కులను తాకట్టు పెట్టడంకన్నా సిగ్గు లేనిది ఏముంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సోమవారం ప్రధానిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేని రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ ఆదివారం చేసిన విమర్శలను రాహుల్‌గాంధీ తిప్పి కొడుతూ ఈమేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు.