ఆరెస్సెస్ అంటే ‘రాష్ట్రీయ సరెండర్ సంఘ్’: రాహుల్
ABN , Publish Date - Apr 26 , 2026 | 03:59 AM
ఆర్‌ఎస్ఎస్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్ఎస్ అంటే ‘రాష్ట్రీయ సరెండర్ సంఘ్’గా అభివర్ణించిన ఆయన..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఆర్‌ఎస్ఎస్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్ఎస్ అంటే ‘రాష్ట్రీయ సరెండర్ సంఘ్’గా అభివర్ణించిన ఆయన.. ఆ సంస్థ దేశంలో నకిలీ జాతీయతను ప్రదర్శిస్తూ, అమెరికాలో మాత్రం పూర్తి విధేయత చూపుతోందని ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో శనివారం ఆయన ఓ పోస్టు చేశారు. ఇరాన్, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని, అమెరికా విధించిన అధిక సుంకాలను కూడా ఒప్పుకొందని ఇటీవల ఆరెస్సెస్ నేత రామ్‌మాధవ్ చేసిన వ్యాఖ్యల వీడియోను దీనికి జతచేశారు. రామ్‌మాధవ్ వ్యాఖ్యలు ఆరెస్సెస్ అసలు స్వభావాన్ని బయటపెట్టాయని రాహుల్‌గాంధీ విమర్శించారు.