శబరిమల బంగారం దోపిడీపై మోదీ మౌనమేల?
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:48 AM
మతాలు, ఆలయాల పరిరక్షణ విషయంలో ప్రధాని మోదీకి శ్రద్ధ లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు.
గుడులు, హిందుత్వపై ఆయన శ్రద్ధ ఇదేనా: రాహుల్ గాంధీ
పతనంతిట్ట, మార్చి 30: మతాలు, ఆలయాల పరిరక్షణ విషయంలో ప్రధాని మోదీకి శ్రద్ధ లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు. శబరిమల అంశంపై ఆయన మౌనమే దీనికి నిదర్శనమన్నారు. ‘‘మతం, ఆలయాల గురించి ఎక్కడకు వెళ్లినా ప్రధాని మోదీ ఊదరగొడుతుంటారు. కానీ, కేరళలో సీపీఎం నాయకులు శబరిమలైలో దోపిడీకి పాల్పడిన విషయం ఆయన మరిచిపోయారు. ఆలయంలో బంగారం దోచేసి ఇత్తడిని దాని స్థానంలో ఉంచిన నిర్వాకం గురించి అయ్యప్ప స్వామి కొలువైన పాలక్కడ్ జిల్లాలో జరిగిన సభలో ఆయన ప్రస్తావించనే లేదు’’ అని ఎద్దేవా చేశారు. పాలక్కడ్ జిల్లాలో సోమవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సభల్లో రాహుల్ పాల్గొన్నారు. అధికార సీపీఎం నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్, బీజేపీ కేరళలో కలిసిపోయాయని చెప్పేందుకు, మోదీకి ఆలయాలు, హిందుత్వం విషయంలో శ్రద్ధ లేదనేందుకు ఈ ఉదంతమే తార్కాణమని విమర్శించారు.