Share News

యువతను ఉగ్రవాదులంటారా?

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:49 AM

కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న, ప్రశ్నిస్తున్న దేశ యువతను ఉగ్రవాదులతో ఆయన పోల్చారని..

యువతను ఉగ్రవాదులంటారా?

  • ప్రధాన్‌ క్షమాపణ చెప్పి వైదొలగాలి: రాహుల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 25: కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న, ప్రశ్నిస్తున్న దేశ యువతను ఉగ్రవాదులతో ఆయన పోల్చారని.. ఇందుకుగాను వారికి క్షమాపణ చెప్పి.. అన్ని విధాలుగా విఫలమైన ఆయన రాజీనామా చేయాలని గురువారం ‘ఎక్స్‌’లో డిమాండ్‌ చేశారు. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా ద్రోహిగా చిత్రించడం బీజేపీ రాజకీయం. మోదీ ప్రభుత్వం అధికార మత్తులో కూరుకుపోయింది’ అని రాహుల్‌ విమర్శిం చారు. ఆందోళనలు చేస్తున్న యువత ఉగ్రవాదులకు ‘బీ’ టీమ్‌ అని ప్రధాన్‌ విమర్శించారంటూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజీత్‌ దీప్కే సైతం మండిపడ్డారు.

Updated Date - Jun 26 , 2026 | 03:49 AM