Share News

ఈ నేరానికి సమాధానం చెప్పాల్సిందే!

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:49 AM

విద్యార్థుల మీద పోలీసుల దాడి ఘటనపై అమిత్‌ షా మౌనం వహించడాన్ని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఎప్పటికైనా ఆయన ఈ దౌర్జన్యానికి సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు.

ఈ నేరానికి సమాధానం చెప్పాల్సిందే!

  • అమిత్‌ షా మౌనంపై రాహుల్‌ నిప్పులు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: విద్యార్థుల మీద పోలీసుల దాడి ఘటనపై అమిత్‌ షా మౌనం వహించడాన్ని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఎప్పటికైనా ఆయన ఈ దౌర్జన్యానికి సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పడానికి బదులుగా ‘క్షమాభిక్షలు’ ప్రసాదించడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘ఛాత్రోంకి గూంజ్‌’ (విద్యార్థుల ప్రతిధ్వని)లో ఓ విద్యార్థి తనతో పంచుకున్న ఆవేదనను రాహుల్‌ ‘ఎక్స్‌’లో గుర్తుచేసుకున్నారు. తమకు ఉన్న భూమిని అమ్మి, అదీ చాలక అప్పులు చేసి మరీ పరీక్షలకు సిద్ధమైతే చివరకు దక్కిందేమీ లేదని బాధిత విద్యార్థి వాపోయినట్లు రాహుల్‌ తెలిపారు. ఇది ఆ విద్యార్థి వైఫల్యం కాదని, అతడి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వలేని వ్యవస్థ వైఫల్యమని ఆయన విమర్శించారు.

Updated Date - Aug 10 , 2026 | 04:50 AM