Share News

జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి: రాహుల్‌

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:07 AM

జంతర్‌మంతర్‌కు వెళ్లినందుకు సీజేపీ నేతలను అరెస్టు చేయటంపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు మండిపడ్డారు. జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి అని.. అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేయటం నేరం కాదని రాహుల్‌గాంధీ అన్నారు.

జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి: రాహుల్‌
rahulgandhi

జంతర్‌మంతర్‌కు వెళ్లినందుకు సీజేపీ నేతలను అరెస్టు చేయటంపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు మండిపడ్డారు. జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి అని.. అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేయటం నేరం కాదని రాహుల్‌గాంధీ అన్నారు. జంతర్‌మంతర్‌లో ధర్నాచౌక్‌ను తాము పునరుద్ధరిస్తామని చెప్పారు. యువతకు అడ్డు రావద్దని మోదీని హెచ్చరించారు. పోలీసులు జైల్లో పెట్టారని భయపడవద్దని సీజేపీ నేతలకు బెంగాల్‌ మాజీ సీఎం, మమతాబెనర్జీ సూచించారు. ‘ఇప్పుడు, ఎప్పుడూ దీదీ (మమత) మీతోనే ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. తామే గొప్ప దేశభక్తులమని చెప్పుకొనేవారు నేడు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన వారిని అరెస్టు చేస్తున్నారని టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ విమర్శించారు. సీజేపీ నేతల అరెస్టును ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ(ఎ్‌సపీ) తదితర పార్టీల నేతలు ఖండించారు. కాగా, ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ తదితర సంఘాల నేతలు బుధవారం జంతర్‌మంతర్‌కు చేరుకొనేందుకు ప్రయత్నించారు.

Updated Date - Oct 15 , 2026 | 04:34 AM