Share News

దీపాలకేనా.. హాస్టళ్లకు నిధులు ఉండవా ?

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:56 AM

దీపాలు వెలిగించడానికి కేంద్రం వద్ద నిధులుంటాయి గానీ, విద్యార్థులు చదువుకునే హాస్టళ్ల నిర్వహణకు ఉండవా? అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. చాత్రోం కీ గూంజ్‌ కార్యక్రమంలో ఓ విద్యార్థిని లేవనెత్తిన ప్రశ్నను ఆదివారం ఆయన తన ‘ఎక్స్‌’ ఖాతాలో ప్రస్తావించారు

దీపాలకేనా.. హాస్టళ్లకు నిధులు ఉండవా ?
rahul

  • ప్రధాని మోదీని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దీపాలు వెలిగించడానికి కేంద్రం వద్ద నిధులుంటాయి గానీ, విద్యార్థులు చదువుకునే హాస్టళ్ల నిర్వహణకు ఉండవా? అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. చాత్రోం కీ గూంజ్‌ కార్యక్రమంలో ఓ విద్యార్థిని లేవనెత్తిన ప్రశ్నను ఆదివారం ఆయన తన ‘ఎక్స్‌’ ఖాతాలో ప్రస్తావించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల నుంచి నగరాలకొచ్చి ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థినులకు తగినన్ని సర్కారీ హాస్టల్‌ వసతుల్లేకపోవడం తీవ్ర సమస్యగా మారిందని రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Sep 21 , 2026 | 05:56 AM