రాహుల్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
ABN , Publish Date - Aug 15 , 2026 | 06:09 AM
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు లోక్‌సభ సెక్రటేరియట్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని సూచిస్తూ..
అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు లోక్‌సభ సెక్రటేరియట్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని సూచిస్తూ ఆ కార్యాలయం రాహుల్‌కు నోటీసు పంపించింది. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత చర్యల నివారణ సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రూల్ నెంబరు 353 ప్రకారం ముందస్తుగా నోటీసు ఇవ్వకుండానే అమిత్ షాపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించారని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్ జైశ్వాల్‌లు ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 28లోగా సమాధానం ఇవ్వాలని సూచిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌కు నోటీసు పంపించింది.