Share News

రాహుల్‌ది సభాధిక్కారం.. క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:20 AM

లోక్‌సభలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ప్రవర్తన సభాధిక్కారం కిందకు వస్తుందని మాజీ సైన్యాధికారులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు ఆక్షేపించారు.

రాహుల్‌ది సభాధిక్కారం.. క్షమాపణ చెప్పాలి

న్యూఢిల్లీ, మార్చి 17: లోక్‌సభలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ప్రవర్తన సభాధిక్కారం కిందకు వస్తుందని మాజీ సైన్యాధికారులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు ఆక్షేపించారు. స్పీకర్‌ను ధిక్కరించడం సభామర్యాద, హుందాతనాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలని 204 మంది రిటైర్డ్‌ సైన్యాధికారులు, మాజీ ఐఏఎస్‌ అధికారులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ‘పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శనలను, నిరసనలను నిషేధిస్తూ స్పీకర్‌ విస్పష్ట ఆదేశాలిచ్చినా.. ఈ నెల 12న పార్లమెంటు ద్వారం మెట్ల వద్ద రాహుల్‌, ఇతర ఎంపీలు నిరసనకు దిగారు. ఇలా చేయడం దేశ అత్యున్నత పార్లమెంటు సభ్యులకు సముచితం కాదు’ అని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి వారు సూచించారు.

Updated Date - Mar 18 , 2026 | 04:20 AM