భారీగా తరలిరండి
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:46 AM
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు.
ప్రజలకు రాహుల్ పిలుపు
మేమూ పాల్గొంటాం: అఖిలేశ్
దీపావళి వ్యాపారాలకు ఆటంకాలు కలిగించొద్దు
ర్యాలీ వాయిదా వేయండి
నేతలకు వ్యాపారుల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, అక్టోబరు 31: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. మధ్యాహ్నం 12గంటలకు కన్నాట్ ప్లేస్ సమీప మింటో రోడ్ జంక్షన్ వద్ద ర్యాలీ ప్రారంభమవుతుందని శనివారం ‘ఎక్స్’లో రాహుల్ తెలిపారు. ఈ ర్యాలీకి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో తాము కూడా పాల్గొంటున్నామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు. మరోవైపు, ఈ ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు శనివారం స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి అనుమతి లభించినప్పటికీ .. కన్నాట్‌ప్లేస్ నుంచి పాదయాత్ర నిర్వహించేందుకు అనుమతించలేదని పోలీసులు తెలిపారు. మింటో రోడ్ జంక్షన్ వద్ద ర్యాలీని ప్రారంభించనున్నట్టు తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. మరోవైపు రామ్‌లీలా మైదానం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా, దీపావళి సీజన్‌లో వ్యాపారాలకు అవరోధాలు కలిగించవద్దంటూ రాహుల్ గాంధీకి అనేక లేఖలు రాసిన వ్యాపారులు.. ఇండీ కూటమిలోని భాగస్వామ్య పార్టీలను ఆశ్రయించారు. ర్యాలీని నవంబరు 11 తర్వాతకు వాయిదా వేసుకునేలా కాంగ్రెస్‌ను ఒప్పించాలని ది చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ర్టీ ప్రతిపక్ష పార్టీల నేతలకు లేఖలు రాసింది. ఇండీ కూటమి ర్యాలీని వీహెచ్‌పీ కూడా తప్పుబట్టింది.