Share News

56వ వసంతంలోకి అడుగుపెట్టిన రాహుల్‌ గాంధీ

ABN , Publish Date - Jun 20 , 2026 | 03:55 AM

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతం...

56వ వసంతంలోకి అడుగుపెట్టిన రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, జూన్‌ 19: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, ‘ఇండియా’ కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్‌కు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఎక్స్‌ వేదికగా రాహుల్‌ను అభినందిస్తూ.. ‘‘రాజ్యాంగ ఆశయాల పట్ల మీకున్న అచంచలమైన నిబద్ధత, అణగారిన వర్గాల కోసం మీరు చేస్తున్న రాజీలేని పోరాటం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించేందుకు, సమాజంలోని బలహీన వర్గాల తరఫున మాట్లాడేందుకు మీరు చూపే ధైర్యం అమోఘం’’ అని కొనియాడారు. మోదీ కూడా ఎక్స్‌ వేదికగా ‘‘మీరు ఆయురారోగ్యాలతో, నిండునూరేళ్లు జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి (తెలంగాణ), డీకే శివకుమారు (కర్ణాటక), వీడీ సీతీశన్‌ (కేరళ), సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు (హిమాచల్‌) తదితరులు రాహుల్‌కు శాభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 20 , 2026 | 03:55 AM