ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివే త ప్రజాస్వామ్య విజయం: రాహుల్
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:03 AM
ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ వేటు ఎత్తివేయడం ప్రజాస్వామ్య విజయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు..
న్యూఢిల్లీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ వేటు ఎత్తివేయడం ప్రజాస్వామ్య విజయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. సస్పెన్షన్ రద్దు కావడంతో ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి సహా ఎనిమిది మంది సభ్యులు బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలందరికీ రాహుల్‌గాంధీ స్వయంగా తేనీటి విందు ఇచ్చారు. సభలో ప్రజాసమస్యలపై గళం వినిపించే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని ఎంపీలకు సూచించారు.