Share News

రాహుల్‌ విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మ: బీజేపీ

ABN , Publish Date - Nov 15 , 2026 | 02:46 AM

విదీశీ శక్తులు, బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ చేతిలో రాహుల్‌గాంధీ కీలుబొమ్మగా మారారని బీజేపీ నేత ప్రదీప్‌ భండారీ ఆరోపించారు.

రాహుల్‌ విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మ: బీజేపీ

న్యూఢిల్లీ, నవంబరు 14: విదీశీ శక్తులు, బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ చేతిలో రాహుల్‌గాంధీ కీలుబొమ్మగా మారారని బీజేపీ నేత ప్రదీప్‌ భండారీ ఆరోపించారు. దేశంలో అస్థిరత సృష్టించేందుకు, విదేశీ సహకారంతో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎక్స్‌ వేదికగా ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన భారత్‌ సమ్మిట్‌లో రాహుల్‌ మాట్లాడుతూ.. 2014లోనే భారత్‌లో ప్రజాస్వామ్యం ధ్వంసమైందని ఆరోపించారు. బీజేపీ ఆస్తులు పదేళ్లలో 11రెట్లు పెరిగాయన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన భండారీ.. విదేశీ ప్రతినిధుల సమక్షంలో ప్రభుత్వ మార్పు గురించి మాట్లాడటం ప్రజాస్వామ్యంలో విదేశీ జోక్యాన్ని కోరుకోవడమేనని ఆరోపించారు. ఇదిలా ఉండగా, భారత్‌ సమ్మిట్‌కు ఈక్వెడార్‌ మాజీ విదేశాంగ మంత్రి గుయిలౌమ్‌ లాంగ్‌ను ఆహ్వానించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జార్జ్‌ సోరోస్‌కు చెందిన సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులకు కాంగ్రెస్‌ వేదిక కల్పిస్తోందని ఆరోపించింది.

Updated Date - Nov 15 , 2026 | 02:48 AM