Share News

కేంద్రం భయపడుతోంది: రాహుల్‌

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:00 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై పూర్తి స్థాయిలో చర్చ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

కేంద్రం భయపడుతోంది: రాహుల్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై పూర్తి స్థాయిలో చర్చ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ అమెరికాకు లొంగిపోయిన విషయం బయటపడుతుందన్న భయంతోనే చర్చకు అంగీకరించడం లేదన్నారు. ఆయన పార్లమెంటు నుంచి పారిపోయారని, సభలో ప్రవేశించే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని.. ప్రజల సమస్యలపై చర్చ జరపాలంటే ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు.

Updated Date - Mar 10 , 2026 | 05:00 AM