Share News

ఢిల్లీలో షాపులను మూసేయించింది బీజేపీనే

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:32 AM

ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో బీజేపీనే ఆదివారం వ్యాపారుల చేత బలవంతంగా షాపులు మూయించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

ఢిల్లీలో షాపులను మూసేయించింది బీజేపీనే

  • బీజేపీ వల్ల ఢిల్లీ వ్యాపారులు నష్టపోయారు: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, నవంబరు 1: ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో బీజేపీనే ఆదివారం వ్యాపారుల చేత బలవంతంగా షాపులు మూయించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బీజేపీ వల్లే స్థానిక వ్యాపారులు నష్టపోయారని చెప్పారు. వాస్తవానికి ఇండియా కూటమి ర్యాలీకి తరలివచ్చే లక్షలాది మందిని ఢిల్లీలో షాపింగ్‌ చేయవలిసిందిగా తాను పిలుపునిచ్చానని రాహుల్‌ అన్నారు. తద్వారా స్థానిక వ్యాపారులకు మేలు చేసినట్లు అవుతుందని భావించామన్నారు. కానీ, తాము ఆదివారం కన్నాట్‌ ప్లేస్‌కు వెళ్లే సరికి షాపులన్నీ మూసేసి ఉన్నాయని, బీజేపీ వాళ్లే షాపులు మూయించినట్లు అక్కడివారు చెప్పారని ఆయన తెలిపారు. ర్యాలీకి ముందు సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో రాహుల్‌ ఈ విషయాన్ని చెప్పారు.

Updated Date - Nov 02 , 2026 | 02:33 AM