బంగళా ఖాళీకి రబ్రీ నిరాకరణ
ABN , Publish Date - May 31 , 2026 | 04:53 AM
ప్రస్తుతం నివసిస్తున్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేసేందుకు బిహార్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (67) నిరాకరించారు.
బలవంతంగా తొలగించవచ్చని వ్యాఖ్య
పట్నా, మే 30: ప్రస్తుతం నివసిస్తున్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేసేందుకు బిహార్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (67) నిరాకరించారు. అవసరమైతే తనను బలవంతంగా ఖాళీ చేయించవచ్చని వ్యాఖ్యానించారు. పట్నాలోని రాజ్‌భవన్‌కు, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉండే సర్క్యులర్ రోడ్డులోని నెంబరు-10 బంగళాలో ఆమె పదేళ్లకుపైగా ఉంటున్నారు. భర్త, మాజీ సీఎం లాలు ప్రసాద్ కూడా ఇక్కడే ఉంటున్నారు. కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఎక్కువ కాలం ఇక్కడే గడుపుతారు. దీనిని వేరే మంత్రికి కేటాయించామని, ప్రతిపక్ష నేతగా మరో బంగళాలో ఉండాలని అధికారులు సూచించారు. అందుకు ఆమె అంగీకరించలేదు.