Share News

వ్యాక్సిన్లు, క్యాన్సర్‌ మందులపై క్యూఆర్‌ కోడ్‌

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:53 AM

నకిలీ, నాసిరకం మందులను అరికట్టడానికి, ఔషధాల సరఫరాలో పారదర్శకతను పెంచడానికి కేంద్ర ఆరో గ్య మంత్రిత్వ శాఖ కీలక చర్యలు చేపట్టింది.

వ్యాక్సిన్లు, క్యాన్సర్‌ మందులపై క్యూఆర్‌ కోడ్‌

  • నకిలీ మందుల కట్టడికి కేంద్రం చర్యలు

న్యూఢిల్లీ, జూన్‌ 25: నకిలీ, నాసిరకం మందులను అరికట్టడానికి, ఔషధాల సరఫరాలో పారదర్శకతను పెంచడానికి కేంద్ర ఆరో గ్య మంత్రిత్వ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇకనుంచి అన్ని రకాల వ్యాక్సిన్లు, క్యాన్సర్‌ మందులు, యాంటీబయాటిక్స్‌, నార్కోటిక్‌, సైకోట్రోపిక్‌ మందుల ప్యాకేజింగ్‌ లేబుల్‌పై బార్‌ కోడ్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు ‘డ్రగ్స్‌ రూల్స్‌ 1945’కు సవరణలు చేసింది. వీటిప్రకారం ఈ క్యాటగిరీ మందులు షెడ్యూల్‌ హెచ్‌2 పరిధిలోకి వస్తాయి. వీటిపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసినప్పుడు మందుల ప్రామాణికతను తెలుసుకోవచ్చు. గతంలో క్యూఆర్‌ కోడ్‌ నిబంధన దేశంలోని 300 అగ్రశ్రేణి ఫార్మా బ్రాండ్‌లకు మాత్రమే ఉండేదని, తాజా సవరణతో దీని పరిధిని విస్తరించామని ఆరోగ్యశాఖ తెలిపింది.

Updated Date - Jun 26 , 2026 | 03:53 AM