Share News

ఖతార్‌ నుంచి కాండ్లా చేరిన ఎల్‌పీజీ ట్యాంకర్‌

ABN , Publish Date - May 18 , 2026 | 02:28 AM

ఖతార్‌లో ఎల్‌పీజీ లోడుతో బయలుదేరిన ట్యాంకర్‌ శనివారం రాత్రి గుజరాత్‌లోని కాండ్లాలో ఉన్న దీన్‌దయాళ్‌ పోర్టుకు చేరుకుంది. మార్షల్‌ ఐలాండ్‌ జెండాతో ఉన్న...

ఖతార్‌ నుంచి కాండ్లా చేరిన ఎల్‌పీజీ ట్యాంకర్‌

కాండ్లా, మే 17: ఖతార్‌లో ఎల్‌పీజీ లోడుతో బయలుదేరిన ట్యాంకర్‌ శనివారం రాత్రి గుజరాత్‌లోని కాండ్లాలో ఉన్న దీన్‌దయాళ్‌ పోర్టుకు చేరుకుంది. మార్షల్‌ ఐలాండ్‌ జెండాతో ఉన్న ఈ ట్యాంకర్‌లో 20వేల మెట్రిక్‌ టన్నుల ఎల్‌పీజీని లోడు చేశారు. ఈ నెల 13న హోర్ముజ్‌ జలసంధిని దాటిన ఈ ట్యాంకర్‌ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకొంది. మార్చి నెల నుంచి ఇంతవరకు భారతీయ జెండాలు ఉన్న 12 ఎల్‌పీజీ ట్యాంకర్లు, ఒక ముడి చమురు ట్యాంకర్‌ హోర్ముజ్‌ను దాటాయి.

Updated Date - May 18 , 2026 | 02:28 AM