Share News

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. ఒకరి మృతి

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:22 PM

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రాండ్ రోడ్డులో తొక్కిసలాట జరగడంతో ఒకరు మరణించగా వంద మందికి పైగా గాయాలపాలయ్యారు.

పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. ఒకరి మృతి
Puri Jagannath Ratha Yatra

ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రాండ్ రోడ్డులో రద్దీ విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట తరహా పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన ఎమర్జెన్సీ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, రద్దీ విపరీతంగా పెరగడంతో ఓ వ్యక్తికి ఊపిరాడక స్పృహ తప్పిపోయినట్టు తెలిసింది. వెంటనే ఆ వ్యక్తిని పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు అయితే, ఈ విషయంపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు, రద్దీ ఎక్కువైన ప్రాంతంలోని మిగిలిన వారిని సహాయక సిబ్బమది తక్షణం తరలించారు. సుమారు 120 మందిని ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటన నేపథ్యంలో రద్దీ నియంత్రణకు అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టినట్టు సమాచారం. ప్రపంచప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథుడి రథయాత్ర లక్షల మంది భక్తుల మధ్య గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు: బీజేపీ ఎంపీ

ఇస్రోలో ఉద్యోగుల రాజీనామాలు.. రంగంలోకి దిగిన కేంద్రం

Updated Date - Jul 16 , 2026 | 06:24 PM