పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం
ABN , Publish Date - May 22 , 2026 | 03:34 AM
పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ముజఫరాబాద్‌లో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు.
పీవోకేలో గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో మృతి
న్యూఢిల్లీ, మే 21: పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ముజఫరాబాద్‌లో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు. పుల్వామా జిల్లా రత్నిపొరాలోని ఖర్బత్‌పొరాకు చెందిన హమ్జా.. ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో 2017లో పాకిస్థాన్‌కు వెళ్లాడు. ఆ తర్వాత పీవోకే నుంచి పనిచేసే నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్‌లో కార్యకర్తగా చేరి.. కమాండర్ స్థాయికి ఎదిగాడు. ఇతడి అసలు పేరు అర్జుమంద్ గుల్జార్‌దార్ కాగా.. డాక్టర్ అని కూడా పిలిచేవారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దాడితో పాటు కశ్మీర్‌లో అనేక ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలతో హమ్జాకు సంబంధముంది.