Share News

రెండో రోజూ కశ్మీర్‌లో నిరసన ప్రదర్శనలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:13 AM

ఇరాన్‌ సుప్రీం లీడర్‌, షియా ముస్లింల మత నాయకుడు అయతుల్లా ఖమేనీ హత్యకు నిరసనగా సోమవారం రెండో రోజు కూడా జమ్మూ-కశ్మీర్‌లో .......

రెండో రోజూ కశ్మీర్‌లో నిరసన ప్రదర్శనలు

శ్రీనగర్‌, మార్చి 2: ఇరాన్‌ సుప్రీం లీడర్‌, షియా ముస్లింల మత నాయకుడు అయతుల్లా ఖమేనీ హత్యకు నిరసనగా సోమవారం రెండో రోజు కూడా జమ్మూ-కశ్మీర్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది సహా 14 మంది గాయపడ్డారు. దాంతో అధికారులు ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. విద్యాసంస్థలను మూసివేశారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల స్పీడ్‌పై ఆంక్షలు విధించారు. కశ్మీర్‌లోయలో మొత్తంగా 75 ప్రదర్శనలు జరిగినట్టు అధికారులు తెలిపారు. చాలాచోట్ల ప్రశాంతంగా జరిగినా, కొన్ని చోట్ల అల్లర్లు జరిగినట్టు చెప్పారు.పలు చోట్లపాక్షికంగా సమ్మె జరిగినట్టు తెలిపారు.

Updated Date - Mar 03 , 2026 | 04:13 AM