Share News

ఆదివాసీ చట్టాలను, మా భూములను రక్షించండి

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:37 AM

మా భూములు మావే.. ఏజెన్సీలో మా బతుకుదెరువును కాపాడండి’ అంటూ ఆదివాసీలు సుప్రీంకోర్టు మెట్లెక్కారు

ఆదివాసీ చట్టాలను, మా భూములను రక్షించండి
SUPREMECOURT

సుప్రీం కోర్టులో 2500 మంది గిరిజనుల పిటిషన్లు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘మా భూములు మావే.. ఏజెన్సీలో మా బతుకుదెరువును కాపాడండి’ అంటూ ఆదివాసీలు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. గిరిజన ప్రాంతాల అస్తిత్వానికి మూలమైన భూ రక్షణ చట్టాలను పరిరక్షించాలని కోరుతూ సోమవారం 2,500మంది గిరిజనులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1,100 మంది, తెలంగాణ నుంచి 1,400 మంది ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి సుప్రీంకోర్టు న్యాయవాది అల్లంకి రమేశ్‌ ద్వారా ఐదు రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రత్యేకంగా 500 మంది గిరిజన మహిళలు తమ కుటుంబాల భవిష్యత్తు కోసం ఒక పిటిషన్‌ వేయగా, 500 మంది వర్సిటీ విద్యార్థులు పోరాటంలో భాగస్వామ్యులయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి

రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు

ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?

Updated Date - Sep 29 , 2026 | 04:37 AM