Share News

Priyanka Gandhi: అసోం స్ర్కీనింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రియాంక

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:24 AM

రాబోయే అసోం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించే స్ర్కీనింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా వాద్రా నియమితులయ్యారు.

Priyanka Gandhi: అసోం స్ర్కీనింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రియాంక

  • తమిళనాడు కమిటీలో అనిల్‌కుమార్‌ యాదవ్‌

గువాహటి/న్యూఢిల్లీ, జనవరి 4: రాబోయే అసోం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించే స్ర్కీనింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా వాద్రా నియమితులయ్యారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఎన్నికలు జరగనున్న అసోం, పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి సంబంధించి పార్టీ అధిష్ఠానం శనివారం రాత్రి స్ర్కీనింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ కమిటీల వివరాలను వెల్లడిస్తూ, అసోం కమిటీకి ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు. ఇక కేరళ స్ర్కీనింగ్‌ కమిటీకి మధుసూదన్‌ మిస్త్రీ, తమిళనాడు, పుదుచ్చేరికి టీఎస్‌ సింగ్‌ దేవ్‌, బెంగాల్‌కు బీకే హరిప్రసాద్‌ చైర్మన్లుగా నియమితులయ్యారు. తమిళనాడు, పుదుచ్చేరి స్ర్కీనింగ్‌ కమిటీలో రాజ్యసభ ఎంపీ మందాడి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సభ్యుడిగా నియమితులయ్యారు.

Updated Date - Jan 05 , 2026 | 02:24 AM