Share News

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి.. దగ్ధమైన బస్సు

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:46 AM

బెంగళూరు నగర శివారులో, 48వ నంబరు జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి.. దగ్ధమైన బస్సు

  • 40 మంది ప్రయాణికులు క్షేమం

బెంగళూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగర శివారులో, 48వ నంబరు జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే మొత్తం 40 మంది ప్రయాణికులు కిందకు దిగిపోగా,. కాసేపటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు నుంచి కళబురిగికి వెళుతున్న సంజనా ట్రావెల్స్‌ బస్సు నెలమంగల సమీపంలోని హనుమంతపుర గేట్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. అతివేగం కారణంగా బస్సు అదుపుతప్పి మొదట డ్రైనేజీ స్లాబ్‌ను ఢీ కొంది. ఆ తరువాత పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు పరుగున వెళ్లి ప్రయాణికులు బయట పడేందుకు సహకరించారు.

Updated Date - Feb 07 , 2026 | 03:46 AM