Prithviraj Chavan: మదురో లాగే మోదీనీ ఎత్తుకుపోతారా
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:21 AM
వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అపహరించినట్టే, ప్రధాని మోదీని కూడా ట్రంప్ ఎత్తుకుపోతాడా అంటూ కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్య....
న్యూఢిల్లీ, జనవరి 6: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అపహరించినట్టే, ప్రధాని మోదీని కూడా ట్రంప్ ఎత్తుకుపోతాడా అంటూ కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ‘‘వెనెజువెలాకు జరిగిందే భారత్ విషయంలోనూ జరగనుందా? ప్రధానిని ట్రంప్ ఎత్తుకుపోతారా?’’ అని చవాన్ సోషల్ మీడియా పోస్టులో ప్రశ్నించారు. దీనికి ‘మెదడు చలించిందా?’ అంటూ చవాన్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఒక అణ్వస్త్ర దేశానికి వెనెజువెలాతో పోలికా అంటూ.. చవాన్ వ్యాఖ్యలను పరిహాసం చేస్తూ మీడియా కథనాలు ప్రసారం చేసింది. చవాన్ తీరును మాజీ రక్షణ, పోలీసు ఉన్నతాధికారులు కూడా తప్పుబడుతున్నారు.