Share News

President Droupadi Murmu: వచ్చే నెల 17న విశాఖకు రాష్ట్రపతి ముర్ము

ABN , Publish Date - Jan 18 , 2026 | 03:52 AM

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వచ్చే నెల 17వ తేదీన విశాఖపట్నం రానున్నారు. భారత నౌకాదళం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా ...

President Droupadi Murmu: వచ్చే నెల 17న విశాఖకు రాష్ట్రపతి ముర్ము

  • ఐఎ్‌ఫఆర్‌, మిలాన్‌కు ముఖ్య అతిథిగా హాజరు

విశాఖపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వచ్చే నెల 17వ తేదీన విశాఖపట్నం రానున్నారు. భారత నౌకాదళం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎ్‌ఫఆర్‌), మిలాన్‌ కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతి ముర్ము 17న నగరానికి చేరుకుని ఐఎన్‌ఎస్‌ చోళాలో బస చేస్తారు. 18న నేవీ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొని, అదేరోజు తిరిగి ఢిల్లీ వెళతారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగానికి, తూర్పు నౌకాదళం అధికారులకు అధికారిక సమాచారం వచ్చింది. కాగా, ఈ కార్యక్రమాల్లో భారత్‌తోపాటు, స్నేహపూర్వక దేశాలకు చెందిన 70 యుద్ధనౌకలు పాల్గొంటాయి. అలాగే, అమెరికా, జపాన్‌, రష్యా, ఆస్ర్టేలియా సహా 55 దేశాల ప్రతినిధులు ఈ అంతర్జాతీయ నౌకాదళ సమ్మేళనానికి హాజరవుతారు.

Updated Date - Jan 18 , 2026 | 03:52 AM