Share News

దగ్గు మందు కావాలంటే చీటీ ఉండాల్సిందే

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:49 AM

డాక్టరు చీటీ లేకుండా దగ్గు మందు అమ్మడాన్ని నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం నిబంధనలను సవరించింది. సిర్‌పలోని మందు నాణ్యత, రోగి భద్రతపై ఆందోళనల నేపథ్యంలో...

దగ్గు మందు కావాలంటే చీటీ ఉండాల్సిందే

  • ఏ సిరప్‌ కొనాలన్నా ప్రిస్ర్కిప్షన్‌ తప్పనిసరి

  • నిబంధనలను సవరించిన కేంద్రం

న్యూఢిల్లీ, జూన్‌ 16: డాక్టరు చీటీ లేకుండా దగ్గు మందు అమ్మడాన్ని నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం నిబంధనలను సవరించింది. సిర్‌పలోని మందు నాణ్యత, రోగి భద్రతపై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అనేక దేశాల్లో మందుల చీటీలేకుండా కొనుగోలు చేసి వాడిన దగ్గు మందువల్ల చిన్నారులు మరణించారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. గతంలో 1000 మంది జనాభాకన్నా తక్కువ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వైద్యుని చీటీ లేకుండా సిరప్‌ కొనుగోలు చేయవచ్చు. అలాగే వాటిని ఏ దుకాణంలోనైనా అమ్మవచ్చు. డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ చట్టం 1940లోని షెడ్యూల్‌ కే, ఎంట్రీ నంబరు 13 మేరకు ఈ వెసులుబాటు ఉండేది. ఆ నిబంధనను సవరించడంతో.. ఇప్పుడు దగ్గు మందు కూడా ఫార్మా లైసెన్స్‌ ఉన్న మందుల దుకాణంలో మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ కూడా తప్పనిసరి. ఈమేరకు సవరణను అధికారిక గెజెట్‌లో డ్రగ్స్‌ రూల్స్‌ 2026(5వ సవరణ)ను ప్రకటించారు.

Updated Date - Jun 17 , 2026 | 03:49 AM