Share News

ఈసీ డిప్యూటీ కమిషనర్‌గా ప్రకాశ్‌ రాజ్‌పురోహిత్‌ నియామకం

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:52 AM

కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌గా రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రకాశ్‌ రాజ్‌పురోహిత్‌ నియమితులయ్యారు.

ఈసీ డిప్యూటీ కమిషనర్‌గా  ప్రకాశ్‌ రాజ్‌పురోహిత్‌ నియామకం
prakashraj

న్యూఢిల్లీ, అక్టోబరు 10: కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌గా రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రకాశ్‌ రాజ్‌పురోహిత్‌ నియమితులయ్యారు. ఇంతకాలం ఈ పదవిలో ఉన్న సంజయ్‌కుమార్‌ స్థానంలో ఆయన్ను భర్తీ చేశారు. 2030 ఏప్రిల్‌ 8 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రకాశ్‌ రాజ్‌పురోహిత్‌ ఇంతకాలం రక్షణ ఉత్పత్తుల విభాగంలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేశారు. ఇండియన్‌ టెలికామ్‌ సర్వీస్‌ అధికారి వివేక్‌ ఖరేను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జాయింట్‌ సెక్రటరీగా నియమించారు. వివేక్‌ నియామకంతో ఎన్టీఏకు మే 16 తర్వాత మొత్తం నలుగురు జాయింట్‌ సెక్రటరీలను నియమించినట్లైంది.

Updated Date - Oct 11 , 2026 | 06:13 AM