Share News

నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు!

ABN , Publish Date - Jun 22 , 2026 | 03:52 AM

సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారంటూ దాఖలైన...

నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు!

  • ప్రకాశ్‌రాజ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

బెంగళూరు, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారంటూ దాఖలైన కేసులో బెంగళూరు 48వ ఏసీజేఎం కోర్టు శనివారం ఈ వారెంట్‌ జారీ చేసింది. ప్రకాశ్‌రాజ్‌కు పలుచోట్ల ఓటు హక్కు ఉందంటూ దిలీ్‌పకుమార్‌ అనే న్యాయవాది 2019లో బెంగళూరు నగరం హలసూరు గేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బీబీఎంపీ అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు ఏపీలోనూ ప్రకాశ్‌రాజ్‌కు ఓటు హక్కు ఉందన్నారు. ఈ కేసులో ప్రకాశ్‌రాజ్‌ విచారణకు వరుసగా హాజరుకాకపోవడంతో కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

Updated Date - Jun 22 , 2026 | 03:52 AM