Share News

పట్టణ ఆవాస్‌ యోజన కింద కొత్తగా 2.88లక్షల ఇళ్లు మంజూరు

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:53 AM

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌2.0(పీఎంఏవై-యూ:2.0)కింద కొత్తగా 2.88లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది.

పట్టణ ఆవాస్‌ యోజన కింద కొత్తగా 2.88లక్షల ఇళ్లు మంజూరు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌2.0(పీఎంఏవై-యూ:2.0)కింద కొత్తగా 2.88లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర హౌసింగ్‌, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మంజూరు చేసినవాటితో కలిపి పీఎంఏవై-యూ:2.0 కింద మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 13.61లక్షలకు పెరిగింది. కేంద్రం తాజా నిర్ణయంతో 16 రాష్ట్రాలు లబ్ధి పొందనున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉన్నాయి.

Updated Date - Feb 25 , 2026 | 12:53 AM