Share News

విదేశీ ప్రయాణాలపై ఏ పన్ను విధించం: మోదీ

ABN , Publish Date - May 16 , 2026 | 03:51 AM

విదేశీ ప్రయాణాలపై కొత్తగా పన్ను విధించేందుకు కేంద్రం యోచిస్తోందంటూ వస్తున్న వార్తాకథనాలను ప్రధాని నరేంద్ర మోదీ కొట్టిపారేశారు.

విదేశీ ప్రయాణాలపై ఏ పన్ను విధించం: మోదీ

న్యూఢిల్లీ, మే 15: విదేశీ ప్రయాణాలపై కొత్తగా పన్ను విధించేందుకు కేంద్రం యోచిస్తోందంటూ వస్తున్న వార్తాకథనాలను ప్రధాని నరేంద్ర మోదీ కొట్టిపారేశారు. ఆ వార్తలు పూర్తిగా అబద్ధమని.. అందులో ఇసుమంతైనా నిజం లేదని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. ‘విదేశీ ప్రయాణాలపై ఏ ఆంక్షలు విధించం. దేశ ప్రజల వ్యాపారాన్ని, జీవనాన్ని సులభతరం చేసే విధానాలకు మేం కట్టుబడి ఉన్నాం’ అని స్పష్టంచేశారు. విదేశీ ప్రయాణాలపై పన్ను విధించేందుకు ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయం టూ ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని ఈ పోస్టుకు జోడించారు.

Updated Date - May 16 , 2026 | 03:51 AM