Share News

ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:06 AM

గణతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచ దేశాధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ

  • గణతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా మోదీ కొత్త రికార్డు

  • 4,339 రోజులతో నెహ్రూను దాటేసిన మోదీ

న్యూఢిల్లీ, జూన్‌ 10: గణతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచ దేశాధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మోదీ భారత ప్రధానిగా బుధవారంతో 4,339రోజులు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న నెహ్రూ రికార్డు(4,338)ను అధిగమించారు. మరే వ్యక్తి కూడా ఇన్ని రోజులు ప్రధానిగా లేరు. మోదీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఇటలీ ప్రధాని మెలోనీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, శ్రీలంక అధ్యక్షుడు అనూరకుమార, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తదితర దేశాల అధినేతలు ఉన్నారు. రాష్ట్రపతి ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అమిత్‌ షా, నితీశ్‌కుమార్‌ తదితర నేతలు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. 2014 మే 26న మోదీ ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2019 మే 30న రెండోసారి ప్రమాణం చేశారు.

Updated Date - Jun 11 , 2026 | 04:06 AM