దేశ విభజన వేళ బెంగాల్‌ను పాక్‌లో కలిపేందుకు కాంగ్రెస్ యత్నం: మోదీ
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:26 AM
దేశ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ బెంగాల్ మొత్తాన్ని పాక్‌లో కలిపేందుకు యత్నించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. విద్రోహ శక్తుల ముందు ఆ పార్టీ మోకరిల్లిందన్నారు.
కోల్‌కతా, జూన్ 20: దేశ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ బెంగాల్ మొత్తాన్ని పాక్‌లో కలిపేందుకు యత్నించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. విద్రోహ శక్తుల ముందు ఆ పార్టీ మోకరిల్లిందన్నారు. అయితే కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా బెంగాల్ అనేక కష్టాలకు ఓర్చుకుని, పోరాట స్ఫూర్తితో తన ఉనికిని కాపాడుకుందని చెప్పారు. పశ్చిమబెంగాల్ అవతరణ దిన వేడుకల్లో భాగంగా హూగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. గత ప్రభుత్వాలు బెంగాల్‌ను చొరబాటుదారులకు సురక్షిత కేంద్రంగా మార్చాయని, దుష్పరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయన్నారు. ఎట్టకేలకు పశ్చిమబెంగాల్ సంకెళ్లు వీడాయని, రాష్ట్ర పునర్ వైభవానికి ప్రయాణం ప్రారంభమైందని మోదీ చెప్పారు.