Share News

నేడు సీఎంలతో ప్రధాని వర్చువల్‌ సమావేశం

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:48 AM

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించనున్నారు.

నేడు సీఎంలతో ప్రధాని వర్చువల్‌ సమావేశం

న్యూఢిల్లీ, మార్చి 26: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళిక, సహకారంపై చర్చించనున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడుల తర్వాత సీఎంలతో ప్రధాని సమావేశం కానుండటం ఇదే తొలిసారి. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి దూరంగా ఉంటారు. ఆ రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీ సమావేశమై సీఎంలతో ప్రధాని సమావేశం వివరాలను తెలియజేస్తారు. కోవిడ్‌ సమయంలో మాదిరిగా దేశమంతా జట్టుగా ఉంటూ ప్రస్తుత పరిస్థితులను కూడా ఉమ్మడిగా ఎదుర్కొందామని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Updated Date - Mar 27 , 2026 | 04:48 AM