నా పిలుపునకు స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు: ప్రధాని మోదీ
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:46 PM
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. 135వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇతర పొదుపు చర్యలను ప్రజలు చేపట్టారని మోదీ అన్నారు. అనేక మంది తమ విదేశీ టూర్లను వాయిదా వేసుకున్నారని చెప్పారు. ప్రపంచస్థాయి సంక్షోభాన్ని భారతీయులు కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.
స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇప్పటికే అనేక మైలురాళ్లను చేరుకుందని కూడా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశీయంగా తయారైన తొలి సీ-295 విమానం కార్యకలాపాలు ప్రారంభం కావడం ఇందుకు నిదర్శనమని అన్నారు. భారత ఎయిరోస్పేస్ రంగం బలోపేతానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. సీ-295 విమానంతో పాటు మరో 40 విమానాలు దేశంలో తయారవుతున్నాయని చెప్పారు. ఇది చిన్న మధ్యస్థాయి పరిశ్రమలను కూడా బలోపేతం చేస్తోందని చెప్పారు. కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. దేశీయంగా తయారైన సీ-295 మిలిటరీ ట్రాన్స్‌పోర్టు విమానం జూన్ 10న తొలిసారిగా ప్రయాణించిన విషయం తెలిసిందే. ఇటీవల నావికాదళంలోకి ప్రవేశించిన మూడు యుద్ధ నౌకలు పూర్తి స్వదేశీ సాంకేతికతో తయారయ్యాయని చెప్పారు. డీఆర్‌డీఓ కూడా ఎన్నో విజయాలను అందుకుందని చెప్పారు. ఇటీవల డీఆర్‌డీఓ ఒక దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిందని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణలో కూడా పురోగతి సాధిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. పర్యావరణ రక్షణకు కీలకమైన హరిగిలా పక్షిపై కొందరు అస్సాం ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు విశేష కృషి చేసిన జీవశాస్త్రవేత్త పూర్ణిమా దేవి బర్మన్‌ను కూడా అభినందించారు. ఒకప్పుడు ఆ పక్షిని అపశకునంగా భావించిన వారే నేడు దాని కోసం సంరక్షణ చర్యలు చేపడుతున్నారని అన్నారు. కేంద్ర సంస్కృత యూనివర్సిటీలో ఏఐ, డేటా సైన్స్‌కు సంబంధించి బీటెక్ కోర్సు ప్రారంభం కావడంపై కూడా ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సంప్రదాయక విజ్ఞనాన్ని ఆధునిక సాంకేతికతను అనుసంధానించడంలో ఇదో కీలక ముందడగు అని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
హిందూ మహాసముద్రం మనందరి ఇల్లు.. సీషెల్స్‌లో భారత్ 'మహాసాగర్' సంకల్పం
ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర.. యాత్రికులకు గుడ్ న్యూస్