తమిళనాడు అభివృద్ధికి విజయ్‌తో కలిసి పనిచేస్తా
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:37 AM
తమిళనాడు అభివృద్థికి సీఎం విజయ్‌తో కలిసి పనిచేస్తానని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వాలు మారినా రాష్ట్ర ప్రగతి, ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పం మారదని స్పష్టం చేశారు.
ప్రభుత్వాలు మారినా నా సంకల్పం మారదు: మోదీ
చెన్నై, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అభివృద్థికి సీఎం విజయ్‌తో కలిసి పనిచేస్తానని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వాలు మారినా రాష్ట్ర ప్రగతి, ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పం మారదని స్పష్టం చేశారు. ఐఐటీ మద్రాస్ ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయ గ్రౌండ్స్‌లో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటైన సభలో ఆయన రాష్ట్రంలో రూ.13 వేల కోట్ల వ్యయంతో పూర్తయిన పథకాలను ప్రారంభించారు. అంతకు ముందు ఐఐటీ మద్రా్‌సలోని మేధో పరిశోధన కేంద్రాన్ని పరిశీలించారు. సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్‌ను జాతికి అంకితం చేశారు. మానవ మెదళ్లకు సంబంధించిన త్రిమితీయ అట్లా్‌సల రూపకల్పన ఈ కేంద్రం ప్రత్యేకత. ఇస్కీమిక్ స్ర్టోక్‌పై పరిశోధనలకు ఉపయోగపడే ‘సీ-స్ర్టోక్’ అట్లా్‌సను కూడా ప్రధాని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతోపాటు విజయ్ కూడా పాల్గొన్నారు. చెన్నై మెట్రో రెండో దశలో భాగంగా పూందమల్లి-వడపళని సర్వీసును మోదీ, విజయ్ కలిసి ప్రారంభించారు.