ఒమన్ సుల్తాన్, కువైట్ ప్రిన్స్‌లతో ప్రధాని మోదీ సంభాషణ
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:50 AM
ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ ప్రిన్స్ షేక్ సాబా అల్ ఖలీద్ అల్ ....
న్యూఢిల్లీ, మార్చి 3 : ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ ప్రిన్స్ షేక్ సాబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ ముబారక్ అల్ సబాలతో మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఆయా దేశాలపై ఇరాన్ జరిపిన దాడులపై తన సానుభూతి తెలిపారని అధికారులు చెప్పారు. ఆ దేశాల్లోని ప్రవాస భారతీయుల భద్రతపైనా ప్రధాని ఆరా తీశారు. అలాగే జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ నహ్యాన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతోనూ సంభాషించి పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితిపై తన ఆందోళనవ్యక్తం చేశారు.