మే 10న హైటెక్‌సిటీ, మల్కాజిగిరి అమృత్ భారత్ రైల్వేస్టేషన్ల ప్రారంభం?
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:30 AM
ప్రధానమంత్రి మోదీ మే నెల 10వ తేదీన హైదరాబాద్ నగరంలోని హైటెక్‌సిటీ, మల్కాజిగిరి అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రారంభించే అవకాశం ఉంది..
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి మోదీ మే నెల 10వ తేదీన హైదరాబాద్ నగరంలోని హైటెక్‌సిటీ, మల్కాజిగిరి అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రారంభించే అవకాశం ఉంది. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఆయన వస్తున్నా.. రైల్వే పరంగా ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల పనులను కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్లతో పాటు 90 శాతం పనులు పూర్తయిన మల్కాజిగిరి, రాధాకృష్ణ నగర్ రైల్వేస్టేషన్లను కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు రైల్వేవర్గాల సమాచారం.